మాతా శిశు సంరక్షణ ప్రభుత్వ లక్ష్యం…
1 min readపల్లెవెలుగు వెబ్ చాగలమర్రి : గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు, రక్తహీనత, పౌష్టికాహార లేమి పూర్తిగా తొలగిపోవాలని, మాత శిశు సంరక్షణ ప్రభుత్వ లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారని చాగలమర్రి మండలం కో అప్డేట్ మెంబర్ జిగ్గిగారి ఇబ్రహీం అన్నారు. గురువారం 17వ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి టీచర్ చంద్రకళ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా గర్భిణీ బాలింతలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, టేక్ హోమ్ రేషన్ ను కో అప్డేట్ మెంబర్, వార్డు మెంబర్ చేతులు మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు, పౌష్టికాహారాన్ని అందించిమాత శిశు సంరక్షణ కల్పించి మాతా శిశు మరణాల రేటు తగ్గించడానికి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. గర్భిణులకు అందించే పౌష్టికాహారం ఎప్పటికప్పుడు సరుకుల నాణ్యతను నిరంతరం పరిశీలించడం జరుగుతుందన్నారు. అంగన్వాడి కేంద్రంలోని చంద్రకళ టీచర్ విధి నిర్వహణలో భాగంగా పలువురి ప్రశంసలు అందుకోవడమే గాక జిల్లా అధికారులు ద్వారా విశిష్ట సేవలందించినందుకు పలు అవార్డులు అందుకోవడం ప్రశంసనీయమని వారన్నారు. నిరంతరం వార్డులో పర్యవేక్షించి గర్భిణీ బాలింతలకు చిన్నారులకు సేవలందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్, హెల్త్ ఎడ్యుకేషన్ వెంకటమ్మ, మహిళా సంరక్షణ కార్యదర్శి శ్రీలక్ష్మి, మహిళా ఆరోగ్య కార్యకర్త మాధవి, అంగన్వాడీ టీచర్ చంద్రకళ, ఆశ వర్కర్ శివలక్ష్మి, అంగన్వాడి సహాయకురాలు సునీత, సుజాత ఉన్నారు. వార్డులోని గర్భిణులు బాలింతలు తదితరులు ఉన్నారు.