PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భక్తి శ్రద్ధలతో మౌలాలి ఉర్సు ఉత్సవాలు

1 min read

– వెండి పంజా అశ్వాన్ని మొక్కుబడి చెల్లించుకున్న బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని సతీమణి జయమ్మ
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: పట్టణంలోని రవ్వలకొండపై నవాబుల కాలంలో వెలసిన మౌలాలి దర్గా ఉర్సు ఉత్సవాలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. హాజరత్ మౌలాలి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఆస్థానం నుంచి నవాబ్ వంశీకులు జండా తీసుకుని మౌలాపహాడ్ రావడంతో ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం గంధం, గురువారం ఉర్సు ఉత్సవాలకు పెద్ద ఎత్తున హిందు, ముస్లిం సోదరులు హాజరై మౌలాలి స్వామికి ఫాతేహాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆయన సతీమణి శ్రీమతి కాటసాని జయమ్మ కుమారుడు ఓబులరెడ్డిలు మౌలస్వామికి మొక్కుకున్న మొక్కుబడిలో భాగంగా స్వామివారి స్మృతి చిహ్నమైన వెండి పంజా అశ్వంను తమ ఇంటివద్దనుంచి బారి ఊరేగింపుగా మౌలాపహడ్ తీసుకవచ్చి దర్గాలో అందచేశారు. మౌలస్వామి తనకు కలలోకి వచ్చి మీకు అంతా మేలు జరుగుతుందని చెప్పటంతో ఆ కోరిక నెరవేరటంతో స్వామికి తాను ఒక వెండి పంజా గుర్రాన్ని చేయిస్తానని మొక్కుకున్నానని స్వామివారి ఉర్సు రోజున స్వామికి అందచేసి మొక్కుబడి తీర్చుకున్నానని అన్నారు.బనగానపల్లె సంస్థానాన్ని పాలించిన షియా నవాబుల ఏలుబడిలో వెలసిన ఈ దర్గా ఇప్పటికి వారి వంశీయుల అధీనంలోనే ఉంటూ ప్రతి ఏటా రజబ్ నెలలో 15 వరోజున జయంతి 18, 19 వరోజుల్లో ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారు. హాజరత్ మౌలాలి దర్గాలోని హజ్రత్ అలీ(పంజాబాబా)ని దర్శించుకోవడానికి అనునిత్యం వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే ఈ దర్గాలోని పంజాబాబాను దర్శించుకుంటే తాము కోరిన కోరికలు నెర వేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల అపార నమ్మకం. ప్రతి యేటా హజ్రత్ అలీ జన్మదినం సందర్భంగా నిర్వహించే ఉర్సు ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. బనగానపల్లె సంస్థానాన్ని పాలించిన షియా నవాబుల ఏలుబడిలో వెలసిన ఈ దర్గా ఇప్పటికి వారి వంశీయుల అధీనంలోనే ఉంటూ ప్రతి ఏటా రజబ్ నెలలో 15 వరోజున జయంతి 18, 19 వరోజుల్లో ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారు. హాజరత్ మౌలాలి దర్గాలోని హజ్రత్ అలీ(పంజాబాబా)ని దర్శించుకోవడానికి అనునిత్యం వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే ఈ దర్గాలోని పంజాబాబాను దర్శించుకుంటే తాము కోరిన కోరికలు నెర వేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల అపార నమ్మకం. ప్రతి యేటా హజ్రత్ అలీ జన్మదినం పురస్కరించుకొని నిర్వహించే ఉర్సు ఉత్సవాలు ఇక్కడ ప్రత్యేకతను సంతరించుకుందని చెప్ప వచ్చు. ఉర్సు ఉత్సవాలను పురస్కరించుకొని మౌలాలి దర్గాకు ప్రత్యేకంగా రంగులు వేసి, ప్రతి కమాన్(స్వాగత చిహ్నాం) కు రంగురంగుల విద్యుత్ దీపాలు అలంకరించి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మౌలాలి గుట్ట, మౌలాలి కమాన్ రంగు రంగుల విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా కనిపించి భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది.

About Author