ఉపవాస దీక్షలు ఫలించి అల్లా ఆయురారోగ్యాలను ప్రసాదించాలి
1 min read
మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి
మంత్రాలయం, న్యూస్ నేడు: రంజాన్ మాసంలో చేసిన కఠినమైన ఉపవాస దీక్షలు ఫలించి అల్లా ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి అన్నారు. సోమవారం మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో ఈద్గ లో ముస్లింల పవిత్ర పండగ రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ మాసంలో చేసిన ఉపవాస ప్రార్థనలు ఫలించి అల్లా మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలను ప్రసాదించి మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా అల్లాను కోరుకుంటూ ప్రార్థనలు చేయడం జరిగిందని తెలిపారు. పరోపకారానికి, సహనానికి ప్రతీక రంజాన్ పండుగ అని అన్నారు. ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అన్నివర్గాల పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని అన్నారు. గత ప్రభుత్వాలు మైనార్టీలను ఓటు బ్యాంకులా మాత్రమే చూశాయని, మన కూటమి ప్రభుత్వం మాత్రమే సర్వమత సామరస్యం పరిఢవిల్లుతున్నదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
