PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే ఆటో కార్మికులతో ‘మే డే’ వేడుకలు!!

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సోమవారం కార్మిక దినోత్సవం సందర్భంగా పాతబస్తీ పూల బజారు సర్కిల్ నందు కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ నగర మేయర్ బి.వై‌. రామయ్య, YSRTUC ఆటో యూనియన్ కార్మికులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు.ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు మరియు బి.వై రామయ్యా గారు మాట్లాడుతూ కార్మికుల పనితీరు గుర్తు చేశారు.కార్మిక సోదరులారా మీ శ్రమ అమూల్యం మీరు సేవానిధులు. ఒక దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మీరే కీలకం నిరంతరం సమాజ హితమే ధ్యేయంగా శ్రమించే కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమం మన ప్రభుత్వ లక్ష్యం అన్ని అన్నారు.అనంతరం కార్మికుల తో కేక్ కటింగ్ మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు 1వ శశావలి ,50వ శేఖమద్ గారు, వైస్సార్సీపీ నాయకులు ఖాదర్ బాషా ,నవీన్ , హకీమ్ ,జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు కేదార్ నాథ్ ,జిల్లా వాకఫ్ బోర్డు మెంబెర్ ఫైరోజ్ ,YSRTUC నాయకులు ఆరిఫ్ ఖాన్ , ఇందాద్ ,నవీన్ , రశేఖర్ , ధనుంజయ్ ఆచారి ,పవన్ ,కృష్ణ , నాగేంద్ర ,లాతీఫ్ ,దావుద్ , చిన్న బాబు , ఖుద్ధుస్ ,ఇంతియాజ్ ,చోటు భాయ్, వాలి,రవి,సంతోష్,సమీర్, తదితరులు పాల్గొన్నారు.

About Author