NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వినాయకుడి ఆశీస్సులతో  ప్రతి ఒక్కరికీ విజయం చేకూరాలి..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  సకల విఘ్నాలను తొలగించే దేవాధిదేవుడు విఘ్నేశ్వరుడు. అందుకే, ఏ పూజ చేయాలన్నా తొలి పూజను ఆయనకే చేస్తారు అని, మనం చేసే మంచి పనులకు ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా ఉండేందుకు వినాయకుడిని పూజచేయాలని, భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితిని వినాయక చవితి జరుపుకోవడం,మరియు గణపతి నవరాత్రులు, అందంగా అలంకరించిన మండపాలు ఈ పండగకు ప్రత్యేకముగా అలంకరించి. ప్రతి ఇంటా వినాయక ప్రతిమలను ఉంచి పూజలు చేస్తూ భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ సంతోషించాలని వినాయక చవితి సందర్భంగా నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు, వైసీపీ అభిమానులకు, నాయకులకు,కార్యకర్తలకు  వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ  గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు.రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఎదురవుతున్న విఘ్నాలన్నీ తొలగిపోయి, ప్రజలందరికీ విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో  ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో మరింత అభివృద్ధి చెందాలని  అభిలషించారు.కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎక్కలదేవి చంద్రమౌళి, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

About Author