లూర్తుమాత ఆర్.సి.యం దేవాలయాన్ని శంకుస్థాపన చేసిన మేయర్
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : స్థానిక క్రొత్త పొనంగి లూర్దునగర్ లో నూతనంగా నిర్మిస్తున్న లూర్దుమాత ఆర్సియం దేవాలయ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈరోజు మరియమ్మ పుట్టినరోజు సందర్భంగా గ్రామంలోని కమ్యూనిటీ హాల్ సమీపంలో ఏర్పాటు చేసిన సభలో రెవరెండ్ ఫాదర్ జాకో మరియు సంఘ పెద్దలు సంఘస్తులు ఆధ్వర్యంలో మేయర్ నూర్జహాన్ పెదబాబు గని ఘనంగా స్వాగతించారు.అనంతరం నూతనంగా నిర్మించు దేవాలయం శంకుస్థాపన కార్యక్రమం వరకు మేయర్ నూర్జహాన్ పెదబాబులను సంఘస్తులు ఘనంగా ఊరేగింపుగా తీసుకువెళ్లారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ దంపతులు ఆలయ నిర్మాణం అతివేగంగా అనుకున్న సమయానికి పూర్తి కావాలని ఆకాంక్షించారుఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నూక పేయి సుధీర్ బాబు,స్థానిక కార్పొరేటర్ దారపు అనూష తేజ కార్పొరేటర్లు సుంకర చంద్రశేఖర్,నిడికొండ అన్నపూర్ణ నరేంద్ర,సబ్బన శ్రీనివాసరావు,జనపరెడ్డి కనక శ్రీ రాజేశ్వరి కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.