PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంసీఏ కోర్సు.. కాల వ్య‌వ‌ధి త‌గ్గింపు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మాస్ట‌ర్స్ ఆఫ్ కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్ (ఎంసీఏ)ను ఇక రెండేళ్లలోనే పూర్తి చేయవచ్చు. ఈ కోర్సు కాలవ్యవధిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. మరోవైపు బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ కోర్సు కాలవ్యవధిని నాలుగు నుంచి నాలుగున్నరేళ్లకు పెంచారు. బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సును డిగ్రీ స్థాయిలో ప్రవేశపెట్టారు. ఇంటర్‌ చదివినవారు దీనిలో చేరవచ్చు. మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సును రెండేళ్ల కాలావధిలో కొత్తగా ప్రవేశపెట్టారు.

                                             

About Author