రష్యాకు మెక్ డొనాల్డ్స్ టాటా !
1 min readపల్లెవెలుగువెబ్ : రష్యన్ వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు మెక్డొనాల్డ్స్ సోమవారం ప్రకటించింది. ఇది 32 సంవత్సరాల తర్వాత రష్యా నుండి అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ చైన్ వ్యాపార నిష్క్రమణ. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని మెక్డొనాల్డ్ ఈ సందర్భంగా ఉదహరించింది, రష్యన్ వ్యాపారం ఇకపై సమర్థనీయం కాదని, అది మెక్డొనాల్డ్ విలువలకు అణుగుణంగా లేదని పేర్కొంది. రష్యాలో మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్లు 850 వరకు ఉన్నాయి, వాటిలో 62 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.