చేపల ఉత్పత్తి పెంపుకు చర్యలు తీసుకోవాలి
1 min read– తుంగభద్ర పరీవాహక మండలాల్లో మైక్రో ఇరిగేషన్ ద్వారా పంటల సాగుకు చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : జిల్లాలో చేపల ఉత్పత్తి పెంపుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ కౌతాళం నుండి గూడూరు వరకు ఉన్న చౌడు భూముల్లో ఫిష్ పాండ్స్ ఏర్పాటు చేసి మత్స్య సంపదను పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.ఇందు కోసం వ్యవసాయ, మైక్రో ఇరిగేషన్ శాఖల తో సమన్వయం తో పని చేయాలన్నారు..జిల్లా మత్స్య శాఖ అధికారి డొమెస్టిక్ మార్కెటింగ్ గురించి వివరిస్తూ మినీ ఫిష్ వెండింగ్ యూనిట్స్ 126 టార్గెట్ ఇచ్చారని, అందులో 74 మందిని గుర్తించామని, అందులో 24 మందికి కూడా బ్యాంకు రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. స్పోక్స్ కు సంబంధించి 10లక్షల నగదుతో కూడిన వాటిలో ఆరుగురిని గుర్తించామని, 20లక్షల నగదుతో కూడిన వాటిలో ఇద్దరిని గుర్తించామని వివరించారు.వ్యవసాయానికి సంబంధించి ఈ-క్రాప్ బుకింగ్ వంద శాతం పూర్తి అయ్యిందని, ఈ-కేవైసి 96 శాతం పూర్తి అయ్యిందని, వైయస్సార్ యంత్ర సేవ పథకం అమలును కూడా నిర్దేశిత గడువు లోపు లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ఆదేశించారు.. పంటలకు అవసరమైన ఎరువులు, పురుగుల మందులను రైతు భరోసా కేంద్రాలలో ముందుగానే సిద్ధంగా ఉంచాలన్నారు… చిరుధాన్యాల ప్రోత్సాహం లో భాగంగా జొన్న, కొర్ర తదితర మిల్లెట్ ల సాగుకు సంబంధించి మండలాల వారీగా 9 క్లస్టర్లను ఏర్పాటు చేశామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జిల్లా కలెక్టర్ కు వివరించారు.. ఆదోని ప్రాంతంలో ప్రత్యేకంగా చిరుధాన్యాల పెంపకాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదేశించారు..తుంగభద్ర పరీవాహక మండలాల్లో మైక్రో ఇరిగేషన్ ద్వారా పంటల సాగు కు చర్యలను వేగవంతం చేయాలని apmip పిడి ని ఆదేశించారు.. పశుసంవర్ధక శాఖ సంబంధించి చేయూత ద్వారా లబ్ది పొందిన లబ్ధిదారులకు పశువుల యూనిట్లను ఏర్పాటు ను పూర్తి చేయాలని సూచించారు.. మీట్,టమోటా, ఉల్లి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డి శేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ఏపీఎంఐపీ పిడి ఉమాదేవి, పశుసంవర్ధక శాఖ అధికారి రామచంద్రయ్య, మత్స్యశాఖ అధికారి శ్యామల తదితరులు పాల్గొన్నారు.