వంక, వాగు ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు
1 min read– మల్లూరు వంకలో ఇసుక తరలిస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు
– జేసీబీ, ఒక ట్రాక్టర్, నాలుగు టన్నుల ఇసుక స్వాధీనం
పల్లెవెలుగు వెబ్, రాయచోటి: కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండలం మల్లూరు గ్రామ కస్పా కు సమీపంలోని వంకలో జెసిబి తో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై బుధవారం తెల్లవారుజామున స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్సై చంద్రమణి ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. దాడిలో జేసీబీ, ఒక ట్రాక్టర్ , 4 టన్నులు ఇసుకను స్వాధీనం చేసుకుని ఇరువురు వ్యక్తులను అరెస్టు చేశారు.
ముద్దాయిలను చిన్నమండెం పోలీసులకు అప్పగించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా వంకలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరైనా వంకలు,వాగులలో ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.