PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదివారం మాంసం దుకాణాలు బంద్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బెంగ‌ళూరులో ఈ నెల 10వతేదీన ఆదివారం మాంసం విక్రయాలను నిషేధించారు. రామ నవమి సందర్భంగా ఏప్రిల్ 10న బెంగళూరు నగరం అంతటా మాంసం విక్రయాలను నిషేధిస్తూ బృహత్ బెంగళూరు మహానగర పాలికే ఉత్తర్వులు జారీ చేసింది. మాంసం దుకాణాలతోపాటు కబేళాలను కూడా మూసివేయనున్నారు. బీబీఎంపీ పరిధిలోని మాంసం దుకాణాలు, కబేళాలు ఆదివారం మూసి ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో మహా శివరాత్రి, గణేష్ చతుర్థి నాడు మాంసం విక్రయాలను నిషేధించారు.

                         

About Author