PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ మెడ్ ప్లస్ ’ సంస్థ పెట్టుబ‌డులు ఆహ్వానిస్తోంది.. త్వర‌లో ప‌బ్లిక్ ఇష్యూకు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఫార్మసీ రిటైల్ చెయిన్ సంస్థ మెడ్ ప్లస్ త‌ర్వలో ప‌బ్లిక్ ఇష్యూకి రాబోతోంది. ఈ ఇష్యూ ద్వార 1639 కోట్లు స‌మీక‌రించ‌నుంది. ఈ మేర‌కు మార్కెట్ రెగ్యులేట‌రీ సెబీకి ముసాయిదా ప‌త్రాలు స‌మ‌ర్పించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 600 కోట్ల తాజా షేర్లు జారీ చేయ‌నుంది. ప్రస్తుత ప్రమోట‌ర్లు, ఇన్వెస్టర్ల వ‌ద్ద ఉన్నషేర్లను ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్ ద్వార విక్రయించి 1038 కోట్లు స‌మీక‌రించ‌నున్నారు. ప‌బ్లిక్ ఇష్యూలో ఉద్యోగుల‌కు కొన్ని షేర్లు కేటాయిస్తారు. షేర్లను జారీ చేయ‌డం ద్వార ల‌భించే నిధుల‌తో అనుబంధ కంపెనీ అయిన ఆప్టివ‌ల్.. నిర్వహ‌ణ పెట్టుబ‌డి కోసం వినియోగిస్తారు. మెడ్ ప్లస్ 2006లో గంగాడి మ‌ధుక‌ర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కంపెనీ మెడిక‌ల్ షాపుల్లో ఔష‌ధాలు, వెల్ నెస్ ఉత్పత్తులు విక్రయిస్తారు.

About Author