ఆదర్శ విద్యా మందిర్ విద్యార్థులకు పతకాలు
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక ఆదర్శ విద్యా మందిర్ చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో బంగారు పతకాలు సాధించారు.మంగళవారం నాడు తమ స్కూల్లో ఏర్పాటుచేసిన అభినందన కార్యక్రమంలో ఆదర్శ విద్యాసంస్థల వ్యవస్థాపకులు బి. తిమ్మయ్య , భరత్, రామ్ చరణ్ ,సూరి మహేష్ బాబు లకు పతకాలు ట్రోఫీని అందజేసి అభినందించారు. పోటీల్లో ప్రతిభ ఘనపరిచిన ఫలితంగా జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషాన్నిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు మహబూబ్ సుభాని, సుదర్శన్, హెడ్మాస్టర్ సుదర్శన్ విద్యార్థులను అభినందించారు.