ప్రజలకు..ప్రభుత్వానికి వారధి..‘మీడియా’
1 min readప్రముఖ కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్
- ‘పల్లెవెలుగు’ క్యాలెండర్ ఆవిష్కరించిన వైద్యులు డా. చంద్రశేఖర్, డా. హేమంత్ కుమార్
కర్నూలు, పల్లెవెలుగు:ప్రస్తుత సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నిస్తూ… అవినీతిని ఎండగట్టే మీడియా రంగం.. మరింత రాణించాలని పిలుపునిచ్చారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్ . సోమవారం కర్నూలు హార్ట్ అండ్ బ్రెయిన్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ‘పల్లెవెలుగు దినపత్రికకు సంబంధించి నూతన క్యాలెండర్‌ను డా. చంద్రశేఖర్‌తోపాటు న్యూరాలజిస్ట్ డా. హేమంత్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ మీడియా రంగం ప్రజలకు..ప్రభుత్వానికి వారధిగా పని చేయాలని సూచించారు. ప్రపంచంలో జరిగే ఏ ఘటన అయినా క్షణాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లే మీడియా రంగం… ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. నిజాన్ని నిర్భయంగా రాసే పత్రికలు.. భవిష్యత్‌లోనూ అదే ఒరవడిని కొనసాగించాలని కోరారు. పల్లెవెలుగు దినపత్రిక.. వెబ్ మీడియాలోనూ అడుగు పెట్టడం శుభ పరిణామమని, పత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్ ఆకాంక్షించారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.