‘మీడియా’.. ఎప్పుడూ బాధ్యతగా ఉండాలి
1 min read– టీటీడీ బోర్డు మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు
పల్లెవెలుగువెబ్, అన్నమయ్య జిల్లా రాయచోటి:సామాజిక బాధ్యతతో, లక్ష్యంతో, ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలన్న ఆశతో ముందుకు సాగిపోతున్న తెలుగు పత్రిక పల్లెవెలుగు దినపత్రిక అని మాజీ టిటిడి పాలకమండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ రాయచోటి నియోజకవర్గ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు గారు పేర్కొన్నారు. బుధవారం తమ కార్యాలయంలో టీడీపీ శ్రేణులతో కలిసి పల్లెవెలుగు దినపత్రిక 2023 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ మన దేశంలోని ఆంగ్లం, హిందీ, తెలుగు, ఉర్దూ వంటి 14 భాషలలో ఎన్నో దిన, వార ,పక్ష, మాస పత్రికలు రిజిస్టర్ అవుతున్నాయి. కానీ అవిమూన్నాల్ల ముచటగా అవి కనుమరువవుతున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాలలో పల్లెవెలుగు ధినపత్రిక పాఠకులకు వివిధ స్టోరీలతో, వ్యాసాలతో, కార్టూన్లతో, ప్రెస్ మీట్ లు, ధర్నాలు ,దీక్షలు ,యాక్సిడెంట్లు, కెమెరాలతో చిత్రీకరించిన రంగురంగుల ఫోటోలు, వివిధ శీర్షికలతో పాఠకులకు అలరిస్తున్న ఏకైక పత్రిక అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి తెలుగు పత్రికలను అందరూ ఆదరించాలి, ప్రోత్సహించాలన్నారు.పాత్రికేయ మిత్రులకు అభినందనలు తెలియజేశారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రవికుమార్, సహధేవ,తదితరులు పాల్గొన్నారు.