జాతీయ వైద్య కమిషన్ మెడికల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడిగా
1 min read
వీసీ డా. చంద్ర శేఖర్ నియామకం
అమరావతి ( హాస్పిటల్ ), న్యూస్ నేడు :జాతీయ వైద్య కమిషన్ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తరుపున మెడికల్ అడ్వైజరీ కౌన్సిల్‌లో సభ్యులు గా డాక్టర్.ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్.పి.చంద్రశేఖర్ ను నియమిస్తూ బుధవారం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, A.P. సెక్రటేరియట్, వెలగపూడి, అమరావతి ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్ అడ్వైజరీ కౌన్సిల్ ఆఫ్ క్లాస్-(2) కింద ఉపదేశ మండలిలో సభ్యునిగా డాక్టర్ ఎన్.టి.ఆర్ యు.హెచ్.ఎస్ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్.కె.బాబ్జీ స్థానంలో డాక్టర్.ఎన్.టి.ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఆంధ్రప్రదేశ్ వైస్-ఛాన్సలర్ డాక్టర్.పి.చంద్రశేఖర్ ను జాతీయ వైద్య కమిషన్‌కు సభ్యులు గా నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తనపై నమ్మకం ఉంచి జాతీయ వైద్య కమిషన్ మెడికల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడిగా నియమించడం ఆనందంగా ఉందని, ఆ పదవిని బాధ్యతగా నిర్వర్తిస్తూ రాష్ట్రానికి మంచి పేరు తీసుకు వస్తానని వీసీ డా. చంద్ర శేఖర్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.