ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖాధికారి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్.శాంతికళ ప్రారంబించినారు.అనంతరం మాట్లాడుతూ శారీరక వ్యాయామం లేకుండా ఒకే చోట కూర్చొని పనిచేస్తే ఆరోగ్యం పాడవుతుందని ,జీవన ఆహారశైలిలో వచ్చిన మార్పులతో ఎక్కువ మంది అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు. రక్తపోటు,షుగర్,క్యాన్సర్ తో పాటు ఇతర వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఆరోగ్యంగా జీవిన్చవచ్చునని తెలిపారు.పూర్వికులు ఆహార పద్ధతి,శ్రమాధారిత జీవనశైలితోనే వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉండేవారని తెలిపారు.ఆహారనియమాలు పాటిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలనీ,ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలి,పచ్చళ్ళు,నిల్వ ఉంచిన ఆహారపదార్థాలను తినకూడదని తెలిపారు. కార్యాలయ సిబ్బంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 18 సంవత్సరములు పై బడిన వారందరూ రక్తపోటు,మధుమేహం వంటి పరిక్షలు చేయిన్చుకోవలన్నారు. ఈకార్యక్రమంలో ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్,శైలేష్ కుమార్,సంచార చికిత్స కార్యక్రమ నోడల్ అధికారి,డాక్టర్,రఘు,కార్యాలయ పరిపాలన అధికారి అరుణ .డెమో శ్రీనివాసులు ,ఎన్సిడి సిబ్బంది ఫైనాన్సు కన్సల్టెంట్ అరుణ, ఆర్కేఎస్కే కన్సల్టెంట్ మల్లికార్జున, సత్యనారాయణ ,ఆరోగ్య కార్యకర్తలు మాధవి,లక్ష్మి,శివమ్మ,డిఈఓ హేమ సాయి,ఆశా రసూల్ బీ మరియు మాస్ మీడియా సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.