NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెడికల్​ క్యాంప్​.. సక్సెస్​..

1 min read

అమ్మ, ఆర్క్​, ఓమ్నీ హాస్పిటల్​ నేతృత్వంలో ఉచిత వైద్య చికిత్సలు

  • బీపీ, షుగర్​, ఈసీజీ, ఎముక పరీక్షలు చేయించుకున్న బాల సాయిబాబా భక్తులు

కర్నూలు, పల్లెవెలుగు:నగరంలోని శ్రీ బాలసాయిబాబా దేవాలయ ఆవరణంలో ఆదివారం భగవాన్​ శ్రీ బాలసాయిబాబా జన్మదిన వేడుకలు, ప్రపంచ శాంతి సదస్సును సెంట్రల్​ ట్రస్టు చైర్మన్​ టి.రామారావు నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు మహాక్రమ్​ గ్రూపు  ఆధ్వర్యంలో అమ్మ, ఆర్క్​, ఓమ్నీ ఆస్పత్రి వైద్యులు  ఉచిత వైద్య చికిత్సలు చేశారు. బీపీ, షుగర్​,  ఈసీజీ, ఎముక పరీక్షలు చేశారు. గుండె సమస్యలు ఉన్న వారిని ఈసీజీ ద్వారా గుర్తించి అవసరమైన వారికి 2డికే చేయించుకోవాలని సూచించారు. 2డికే కూడా తమ ఆస్పత్రిలో ఉచితంగా చేస్తామన్నారు. వైద్య పరీక్షలు చేయించుకున్న భక్తులకు అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. దాదాపు 200 మంది దాకా ఉచిత వైద్య శిబిరంలో చికిత్సలు పొందారు.  భగవాన్​ శ్రీ బాలసాయిబాబా ఆశీర్వాదంతో తమకు ఉచితంగా కుట్టుమిషన్లు, గ్రైండర్లు, ఇస్ర్తీ పెట్టెలు ఇవ్వడమేకాక.. ఉచిత వైద్యశిబిరం నిర్వహించి మందులు కూడా ఉచితంగా అందజేశారని బాలసాయిబాబా భక్తులు కొనియాడారు.  అమ్మ ఆస్పత్రి వైద్యులు డా. త్రినాథ్​, డా.శశిధర్​ రెడ్డి , ఆయా ఆస్పత్రుల వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

About Author