PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కస్తూర్బా పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు

1 min read

పల్లెవెలుగు, వెబ్ మిడుతురు:స్థానిక మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 15 మంది బాలికలకు గత మూడు రోజుల నుండి విష జ్వరాలు రావడం పట్ల కస్తూర్బా పాఠశాలలో కడుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ప్రత్యేకంగా విద్యార్థులకు వైద్య శిబిరం నిర్వహించారు.వెంటనే ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి,ఈఓఆర్డి ఫక్రుద్దీన్ పాఠశాలలో విద్యార్థులతో మరియు పాఠశాల సిబ్బందితో విద్యార్థులకు విష జ్వరాలు రావడానికి గల కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు.చిన్న పిల్లల వైద్యులు తిరుపతి మరియు వైద్య సిబ్బంది విద్యార్థులకు రక్త పరీక్షలు సేకరించి రక్త నమూనాలను ల్యాబ్ కు పంపారు.ఆరోగ్య జాగ్రత్తల పట్ల ఏవిధంగా ఉండాలంటూ వైద్య సిబ్బంది విద్యార్థులకు తెలియజేశారు.ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి భోజనాలు చేసేటప్పుడు వంట పాత్రలు శుభ్రంగా చేసి వంట చేయాలని అంతేకాకుండా పాఠశాలలో శుభ్రంగా ఉంచుతూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో,ఈవోఆర్డి పాఠశాల సిబ్బందికి సూచించారు.ప్రతిరోజు త్రాగునీటి ట్యాంకును శుభ్రం చేయాలన్నారు.మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదని ఎంపీడీవో దృష్టికి పాఠశాల ఉపాధ్యాయులు తీసుకువచ్చారు.మినరల్ వాటర్ ప్లాంట్ కొరకు మీరు నాకు లెటర్ ఇచ్చినట్లయితే జిల్లా అధికారులకు నేను పంపడం జరుగుతుందని ఆయన వారికి తెలియజేశారు.గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పాఠశాల మరియు ప్రాంగణంలో గ్రీన్ అంబాసిడర్ల ద్వారా బ్లీచింగ్ పౌడర్ ను వేయించారు.ఈకార్యక్రమంలో పాఠశాల ఎస్ఓ ఉమా గైర్వాణి,పీఈటి సుమలత,సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తి,పంచాయతీ కార్యదర్శి సుధీర్ నందకుమార్,వెల్ఫేర్ అసిస్టెంట్ దాసరి మధు,కేశావతి,ఏఎన్ఎంలు,ఆశా కార్యకర్తలు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

About Author