NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మెడీకాల్ ఎక్స్ పో

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మెడ్ ఎక్స్పర్ట్ బిజినెస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించే అతిపెద్ద బీ2బీ మెడికల్ ఉపకరణాల ట్రేడ్ ఫెయిర్ అయిన మెడీకాల్ మార్చి 17 నుండి 19 వరకు హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతుంది. ఈ మెడీకాల్ 32వ ఎడిషన్ సర్జికల్ కాటన్ నుండి అధునాతన ఇమేజింగ్ పరికరాలు, శస్త్రచికిత్సా ఉపకరణాల వరకు ఆసుపత్రిలోని అన్ని అవసరాలపై దృష్టి పెడుతుంది.మెడీకాల్ వారు షోస్టాపర్ అయిన ఒక ఇంటరాక్టివ్ బ్రెయిన్ స్టార్మ్ కూడా నిర్వహిస్తున్నారు. మెడీకాల్ లో, వైద్యం నిర్వహణ కలిసి మేధోపరంగా ఉత్తేజపరిచే సెమినార్లు, వర్క్షాప్లు, అన్కాన్ఫరెన్స్ లు, ఆసుపత్రులని నడపడంలోని వ్యాపార అంశాలపై పరిజ్ఞానాన్ని పొందడానికి, వ్యాప్తి చేయడానికి మెడికల్ ఫ్రైటర్నిటీ కోసం ఓపెన్ డిస్కషన్ సెషన్లని అందిస్తుంది. మెడీకాల్ బ్రెయిన్టెర్మ్ లోని ఇంటరాక్టివ్ హెల్త్ కేర్ ఇంటెలిజెంట్సియా క్లుప్తంగా జ్ఞానాన్ని అందిస్తుంది. హెల్త్కేర్ పరిశ్రమలో ఉపయోగించే కొత్త నైపుణ్యాలు, సాంకేతికతలపై ప్రత్యక్ష అనుభవాన్ని ప్రేరేపిస్తుంది.ఎక్స్ పో గురించి మాట్లాడుతూ “ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన చిన్న, మధ్య తరహా ఆసుపత్రుల యజమానులు అర్హత కలిగిన పర్చేజ్ మేనేజర్లను కలిగి ఉండలేరు. ఈ ఆసుపత్రుల యజమానులందరినీ కలవడానికి పరికరాల కంపెనీల వద్ద తగినంత సేల్ఫోర్స్ కూడా లేదు. నేను నా ఆసుపత్రి కోసం కష్టాన్ని ఎదుర్కొన్నాను కాబట్టి, మెడీకాల్ అన్ని పరికరాల తయారీదారులని ఒకే చోటుకి చేరుస్తుందని నేను అనుకున్నాను,” అని మెడీకాల్ వ్యవస్థాపకులు, సీఈఓ ఎస్ మణివణ్ణన్ అన్నారు.

About Author