నర్సింగ్ స్టాప్ ను వైద్య విద్య అర్హత ఉన్నవారినే తీసుకోవాలి
1 min read
ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్య విద్య అర్హత లేనివారితో వైద్య సేవలు అందిస్తున్న వైనం
జిల్లా ఆరోగ్య వైద్య అధికారుల పర్యవేక్షణ లేదు.
నర్సెస్ ..నర్సింగ్ విద్యార్థి నాయకుడు భాస్కర్ నాయుడు డిమాండ్.
కర్నూలు, న్యూస్ నేడు: ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ.కర్నూల్ లోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో కచ్చితంగా నర్సింగ్ స్టాఫ్స్ ను తగిన విద్య అర్హత ఉన్నవారినే తీసుకోవాలి. చాలా హాస్పిటల్స్ లో యాజమాన్యం లాభం కోసం అరహులు కానీ ఇంటర్మీడియట్, పదవ తరగతి డిగ్రీ పాసైన, ఫెయిల్ అర్హులు కాని వారితో 6,7,8 వెలు, జీతాలు ఇచ్చి అలాగే నర్సింగ్ పూర్తి కానటువంటి విద్యార్థులతో వైద్య సేవలకు ఉపయోగించుకుంటున్నరు. మరియు అర్హత ఉన్నవారిని కూడా చాలిచాలని జీతాలు ఇచ్చి పని ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఇంకా చదివిన వారికి చదవని వారికి విలువ ఒకటేనా..?కనీసం అవగాహన లేకుండ ఉంటే ఎలా..? ఎంతో మంది పేద ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కారణమేమనగా ఏం అయినా అంటే రోగికి ఆపరేషన్ జరిగే ముందు జరిగిన తర్వాత ఏమైనా మాకు సంబంధం లేదు అని కౌన్సెలింగ్ అని సంతకాలు మరియు వీడియోలు తీసుకుంటున్నారు హాస్పటల్ యాజమాన్యం. అయితే వైద్య విద్యార్థుల పరిస్తితి ఏంటి…? ఎంతోమంది రాష్ట్రాన్ని వదిలి బయట రాష్ట్రాలకు హాస్పిటల్లో పనిచేయడానికి వెళ్తున్నారు ఎందుకంటే లేబర్ఆక్ట్ ప్రకారం వేతనాలు కూడా ఇవ్వడం లేదు. హాస్పిటల్స్ లో డాక్టర్స్ లేకుండ కూడా ఆపరేషన్లు సర్జరీలు ఎన్నెన్నో జరుగుతున్నాయి ఎవరు అనుభవం కలిగిన వారు ఉంటే వాళ్ళే డాక్టర్లు. జిల్లా వైద్యాధికారులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఒకటే తెలియజేస్తున్న . రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పటల్లో పని చేస్తున్న నర్సులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా రాత్రనక పగలనక హాస్పిటల్ యాజమాన్యం పని ఒత్తిడితో ఇష్టం వచ్చినట్టు డబల్ డబల్ షిఫ్టింగ్ వేస్తూ నర్సులను ఇబ్బందులకు గురి చేస్తున్నార. ఎంతోమంది రోగుల ప్రాణాలు కాపాడుతూ సమాజానికి ఆదర్శవంతమైన జీవితం జీవిస్తున్న ప్రైవేట్ నర్సులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం నర్సులకు ప్రత్యేక స్థానం కల్పించాలి అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రైవేటు హాస్పిటల్ లో పనిచేస్తున్న నర్సులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత అలాగే ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాల పని ఒత్తిడి నుండి మినహాయింపు కల్పించాలి నర్సులకు జరిగే అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దివాకర్ బాబు,జిల్లా కార్యదర్శి రవి ప్రకాష్, ట్రెజరర్ శ్రీనివాసులు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.