ఇంటి వద్దకే వైద్య సేవలు..
1 min readపల్లెవెలుగు, వెబ్ వెలుగోడు: గ్రామీణ ప్రజలకు ఇంటివద్దకే వైద్యసేవలందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కార్యక్రమంలో భాగంగా శనివారం రేగడగుడూర్ 1 గ్రామ సచివాలయంలో, వేల్పనూర్ పిహెచ్ సి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వంశీ కృష్ణ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలు అనారోగ్యం కలిగితే పి హెచ్ సి పెద్దా సుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లవలసిన అవసరం లేకుండా గ్రామంలోనే వైద్య సేవలు అందిస్తామన్నారు. వ్యాధి లక్షణాలను బట్టి, వ్యాధిని పరీక్షల ద్వారా గుర్తించి, అవసరమైతే స్పెషలిస్టు వైద్యం కోసం రెఫర్ కూడా చేస్తామన్నారు. రోగులకు 14 రకాల పరీక్షలు, 67 రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ముఖ్యంగా గర్భస్థ శిశువు మరణాలు , మృత్యు మరణాలను , తగ్గించేందుకు పనిచేస్తామన్నారు. అంతేకా కుండా తమ వైద్య బృందం ద్వారా యాంటినేటల్, పోస్ట్ నేటల్ సేవలు అందిస్తామన్నారు. దేశ చరిత్రలోనే వైద్య ఆరోగ్య శాఖలో ఇది సరికొత్త విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎంపిహెచ్ఇఓ శ్రీనివాసులు గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏమ్ ఎల్ హెచ్ పి, ఎమ్ పి హెచ్ ఏ (ఏమ్), ఏ ఎన్ ఎమ్, ఆశావర్కర్లు, 104 సిబ్బంది పాల్గొన్నారు పాల్గొన్నారు.