ఇంటి వద్దకే వైద్య సేవలు
1 min read– మండల ప్రభుత్వ వైద్యాధికారి..మొల్ల జబీన్.
పల్లెవెలుగు వెబ్ గడివేముల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటి వద్దకే వైద్య సేవలు అమలు చేస్తున్న ఫ్యామిలీ ఫిజిషీయన్ కాన్సెప్ట్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రభుత్వ వైద్యాధికారి మొల్లా జబీన్ తెలిపారు. శనివారం నాడు మండల పరిధిలోని పెసరవాయి గ్రామంలో ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సచివాలయం ఆవరణంలో గ్రామంలోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో మంచానికే పరిమితమైన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఇంటి వద్దకే వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ పథకం ఎంతో కార్యక్రమంలో వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.