PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు

1 min read

పల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: ప్రజలకు గ్రామాలలోని వైద్య సేవలు అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం వైయస్సార్ విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేసిందని వైద్యాధికారి ప్రసాద్ తెలిపారు. రుద్రవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మండలంలోని శ్రీరంగాపురం గ్రామ సచివాలయంలో గురువారం నిర్వహించిన వైయస్సార్ విలేజ్ క్లినిక్ శిబిరంలో 50 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రధానంగా బీపీ షుగర్ వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తామన్నారు. సీజనల్ వ్యాధులు జ్వరాలు తదితర చిన్న చిన్న వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేసి కేంద్రంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చిన్నారులకు గర్భవతులకు బాలింతలకు నాణ్యమైన పోషకాహార పదార్థాలు అందించాలని చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని అంగన్వాడి సిబ్బందికి సూచించామన్నారు. గర్భవతులు ప్రధానంగా బాలింతలు వారి ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై వివరించామన్నారు. ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పౌష్టికాహారం ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు 12 రకాల వైద్య సేవలు 14 రకాల వైద్య పరీక్షలు 65 రకాల మందులు అందించడమే వైయస్సార్ విలేజ్ క్లినిక్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాగలక్ష్మి ఎంఎల్పిహెచ్ శాంతి హెల్త్ సూపర్వైజర్ యోగేశ్వరయ్య డేటా ఆపరేటర్ ప్రశాంత్ ఏఎన్ఎం కాశింబీ వైద్య సిబ్బంది 104 సిబ్బంది ఆశా వర్కర్లు సచివాలయం సిబ్బంది ఉపాధ్యాయులు అంగన్వాడి సిబ్బంది విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author