PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైయస్సార్ విలేజ్ క్లీనిక్ 104 ద్వార వైద్య సేవలు

1 min read

– కొండపేట లో వైద్య సేవలు పరిశీలించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, డాక్టర్ నాగరాజు
పల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం లో భాగంగా ప్రభుత్వం , గ్రామాలలోకి 104 ద్వారా ఫ్యామిలీ డాక్టర్, పి జి సియన్ ఏర్పాటు చేసి ప్రజల ముంగిట కె వైద్య సేవలు విస్తరించి అక్కడి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఉమా మహేష్ కుమార్ లు అన్నారు, గురువారం వారు మండలంలోని కొండపేట గ్రామపంచాయతీలో సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో, వైద్య సేవలు ప్రారంభించారు, ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ, చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని 8 సెంటర్లుగా విభజించి ప్రతి సెంటర్ కు నెలకు రెండు మూడు సార్లు నిర్దేశించబడిన రోజులలో ఆయా గ్రామ సచివాలయ ప్రాంతాల పరిధిలో అక్కడి ప్రజలకు అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడి రోగులకు తగిన మందులు అందించబడతాయి అని వారు తెలియజేశారు, అంతేకాకుండా ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించుకుని ఇంటి వద్ద బెడ్ మీద ఉన్న రోగులకు అవసరమైతే అక్కడికి వెళ్లి వైద్య సేవలు అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిందని ప్రజలు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని వారు తెలియజేశారు, అంతేకాకుండా ఈనెల 21వ తేదీన జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో పి హెచ్ సి , సి హెచ్ సి ఓకే చోట ఉన్నాయని, పి హెచ్ సి నీ కొండ పేట కు తరలించాలని ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగిందని ఆయన అన్నారు, అయితే ఇందుకు సంబంధించి కొండపేట ఆరోగ్య ఉప కేంద్రానికి, అదేవిధంగా చెన్నూరు లోని విలేజ్ హెల్త్ సెంటర్ ను పరిశీలించడం జరిగిందన్నారు, ఈ విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కార దిశగా చూస్తామని వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిర్ల సురేష్ యాదవ్, డాక్టర్ బి చెన్నారెడ్డి, డాక్టర్ వంశీ కృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

About Author