NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నల్లబ్యాడ్జీలతో వైద్య సిబ్బంది నిరసన

1 min read
నిరసన తెలుపుతున్న వైద్యులు, సిబ్బంది

నిరసన తెలుపుతున్న వైద్యులు, సిబ్బంది

పల్లెవెలుగు వెబ్​, మహానంది:  మహానంది మండల కేంద్రం తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద  వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల కొవిడ్‌పై వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జూమ్ యాప్ ద్వారా సమీక్ష చేస్తూ వైద్య సిబ్బంది పట్ల అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారని డాక్టర్లు చంద్రశేఖర్ , లింగన్న ఆరోపించారు. తమ మనోభావాలు దెబ్బతినటంతో పాటు వృత్తిని కించపరిచేలా ప్రవర్తించిన కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా కష్ట కాలంలో ఎన్నో సమస్యలున్నా వైద్యులు, సిబ్బంది మనోధైర్యంతో సేవలందిస్తున్నారని, తమ కృషిని గుర్తించకపోగా… ఇలా మాట్లాడటం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్​పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వైద్యులు డా. చంద్రశేఖర్​, డా. లింగన్న ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో  ఏపీ ఎన్జీవోల జనరల్ సెక్రెటరీ కార్యదర్శి హుస్సేన్ రెడ్డి, ఆరోగ్య మిత్ర చంద్రశేఖర్, విజయ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author