పీఎం జన ఔషధ మందులను సద్వినియోగం చేసుకోండి
1 min read
కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు:ప్రధానమంత్రి జనరిక్ ఔషధ మందుల దుకాణాల ద్వారా తక్కువ ధరకే లభ్యమయ్యే నాణ్యమైన మందులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. కేంద్ర ప్రభుత్వ జన ఔషధ దివస్ సందర్భంగా శుక్రవారం నంద్యాల పట్టణంలోని రైతు నగర్ లోని జనరిక్ మందుల దుకాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రాల ద్వారా తక్కువ ధరకే బ్రాండెడ్ కంపెనీల మందులను అందుబాటులో ఉంచుతుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలకు అవసరమైన మంచి బ్రాండెడ్ కంపెనీల ద్వారా తయారుచేసిన మందులను జనరిక్ మందుల దుకాణాల్లో ఉంచడం జరుగుతుందన్నారు. సాధారణంగా బిపి, షుగర్ ఉన్నవాళ్లకి ఇతర షాపుల్లో నాలుగైదు వేల రూపాయలు అయ్యే మందులు జనరిక్ మందుల దుకాణంలో అతి తక్కువ ధరకే మందులు లభ్యమవుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య విద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వెంకటరమణ కలెక్టర్ వెంట ఉన్నారు ఉన్నారు.