ఎమ్మార్పీ రేట్ల కంటే తక్కువ ధర లకు మందులివ్వాలి
1 min read– అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ
పల్లవెలుగు వెబ్ కర్నూలు: ప్రభుత్వ సర్వజన వైద్యశాల గైనిక్ , చిన్నపిల్లల విభాగం మరియు పలు ఓపిస్ సెంట్రల్ ఈసీజీ, ఆసుపత్రి ఔషధశాల op (13), జీవన్ దార మెడికల్ షాప్ పలు విభాగాలలో రౌండ్స్ నిర్వహించినట్లు తెలిపారు.జీవన్ దార మెడికల్ షాప్ లో తనిఖీ నిర్వహించి అనంతరం మందుల లిస్ట్ ను పరిశీలించి మెడికల్ షాప్ లో ఉన్న మందులు యొక్క ఎక్స్పైర్ డేట్ లను పరిశీలించి మరియు పేషంట్లకు ఎమ్మార్పీ రేట్ల కంటే తక్కువ ధర లకు మందులు ఇవ్వాలని మెడికల్ షాప్ సిబ్బందికి ఆదేశించారు.పలు విభాగాలలో శానిటేషన్ సూపర్వైజర్ల మరియు శానిటేషన్ సిబ్బంది పై అసహనం వ్యక్తం చేశారు ప్రతిరోజు ఆసుపత్రిని మరియు విభాగాలను పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్ సిబ్బందికి ఆదేశించారు.క్యాజువల్టిలో రౌండ్స్ నిర్వహించి అనంతరం క్యాజువల్టి వచ్చే ఎమ్మెల్సీ MLC మరియు ఆక్సిడెంట్ కేసెస్ ల గురించి ఆరా తీశారు అనంతరం పేషంట్లకు ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ అందించి వారికి ఎప్పటికప్పుడు డిస్పాచ్ అయ్యేటట్టు చూసుకోవాలని CMOs ను ఆదేశించారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి CSRMO, డా.వెంకటేశ్వరరావు, మరియు నర్సింగ్ సిబ్బంది, మరియు శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి, గారు తెలిపారు.