PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మీ జీ తెలుగులో! ఈ ఆదివారం 6 గంటలకు.. ‘రావణాసుర’

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించడంలో ఎప్పుడూ ముందుండే జీ తెలుగు ఈ వారం మరో కొత్త సినిమాతో వచ్చేస్తోంది. మాస్ మహారాజ రవితేజ నటించిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ సినిమాని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా అందిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ క్రిమినల్ లాయర్ రవీంద్రగా మెప్పించిన ‘రావణాసుర’, జూలై 23 ఆదివారం సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో!ర‌వీంద్ర (ర‌వితేజ‌) ఓ జూనియ‌ర్ ల‌య‌ర్‌. మాజీ ప్రియురాలు అయిన క్రిమిన‌ల్ లాయ‌ర్ క‌న‌క మ‌హాల‌క్ష్మి (ఫ‌రియా అబ్దుల్లా) ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా ప‌నిచేస్తోంటాడు. ఫార్మా కంపెనీ సీఈఓ హ‌రిక (మేఘా ఆకాష్‌) తండ్రి (సంప‌త్‌రాజ్‌) ఓ మ‌ర్డ‌ర్ కేసులో చిక్కుకుంటాడు. ఆ త‌ర్వాత హారిక‌తో పాటు సిటీలోని మ‌రికొంద‌రుప్ర‌ముఖులు హ‌త్య‌ల‌కు గుర‌వుతారు. ఈ హ‌త్య‌ల‌కు ర‌వీంద్ర‌తో ఎలాంటి సంబంధం ఉంది? ఈ సీరియ‌ల్ మ‌ర్డ‌ర్స్ లో సాకేత్ (సుశాంత్‌) పాత్ర ఏమిటి? ఈ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీని ఏసీపీ హ‌నుమంత‌రావు (జ‌య‌రాం) ఎలా ఛేదించాడు? అనేదే ఈ సినిమా కథ.దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాను అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మించారు. అయిదుగురు హీరోయిన్లు ఫ‌రియాఅబ్దుల్లా, మేఘాఆకాష్, అనుఇమ్మాన్యుయేల్‌, పూజితాపొన్నాడ, దక్ష నగార్కర్ నటించారు. సంపత్ రాజ్, జయరాం, సుశాంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మాస్కి కేరాఫ్ అయిన రవితేజ నెగెటివ్ షేడ్స్లో అలరించిన ఈ సినిమాను మీరూ మిస్సవకండి.

About Author