జగన్ ను రహస్యంగా కలవమంటే కలుస్తా !
1 min read
పల్లెవెలుగువెబ్ : వరుస అప్పులు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసిందని వెల్లడించారు. ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ చేసిన అప్పులను ఏం చేసిందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. విజయవాడ లోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మంగళవారం మీట్ ద ప్రెస్‌లో మాట్లాడారు. జగన్ తనను కలవడానికి ఆసక్తి చూపడం లేదని, రహస్యంగా పిలిచినా వెళ్లి తాను కలుస్తానని చెప్పారు.