NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

7న పత్తికొండలో ఉమ్మడి జిల్లాల ఎమ్మార్పీఎస్ కార్యవర్గ సదస్సు

1 min read

జిల్లా అధ్యక్షుడు  పులికొండ మాదిగ పిలుపు

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  ఈనెల 7వ తేదీన పత్తికొండలో తలపెట్టిన ఉమ్మడి జిల్లాల ఎమ్మార్పీఎస్ కార్యవర్గ సదస్సులు జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు వినుకొండ మాదిగ పిలుపునిచ్చారు. శుక్రవారం పత్తికొండ ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో    మండల అధ్యక్షులు సుధాకర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్నూలు జిల్లా అధ్యక్షులు పులికొండ మాదిగ హాజరై మాట్లాడుతూ,ఏబిసిడి వర్గీకరణ పై పత్తికొండ లో ఈనెల 7వ తేదీ ఆదివారం కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్ నందు జరగబోయే ఉమ్మడి జిల్లాల ఎమ్మార్పీఎస్ కార్యవర్గ సమావేశానికి వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ  ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి ఉమ్మడి నంద్యాల కర్నూల్ జిల్లాల మాదిగలు, మాదిగ ఉప కులాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చిన్న అంజనేయ మాదిగ, నరసింహులు మాదిగ, కె రంగస్వామి, ఈశ్వరయ్య, హోసూరు రంగప్ప, జగ్గిల ధనంజయ తదితరులు పాల్గొన్నారు.

About Author