NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నంద్యాల అసెంబ్లీ నియోజవర్గ స్థాయి సమన్వయ కర్తల సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నంద్యాల అసెంబ్లీ నియోజవర్గ స్థాయి సమన్వయ కర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్. చింతల మోహన్ రావుఅఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు మరియు ఏపీసిసి అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్ర రాజు గారి డీసీసీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ గారి ఆదేశాల మేరకు నంద్యాల కాంగ్రెస్ కమిటీ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని సమస్యల గురించి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గ మొత్తం కూడా అభివృద్ధి కుంటుపడిందని ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా అభివృద్ధి గురించి పట్టించుకోవడంలేదని అందువలన రేపు జరగబోయే MLC ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేసిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ PDF ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు గారికి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఏపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్. చింతల మోహన్ రావు , ఏపీ సి సి అధికార ప్రతినిధి ఊకట్టు వాసు, పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య, జిల్లా కోశాధికారి ఎస్ వై డి ప్రసాద్, ఎస్సీ సెల్ రాష్ట్ర సమన్వయకర్త కరాటే బాలకృష్ణ, సేవ దళ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయలక్ష్మి, జిల్లా కార్యదర్శి పలరాజ్ ,సీనియర్ మైనారిటీ నాయకులు చాబోలి సలాం, తదితరులు పాల్గొన్నారు.

About Author