PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏలూరు 38వ డివిజన్ లో వైసీపీ కార్యకర్తల సమావేశం..

1 min read

కార్యకర్తలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి..

ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్థానిక 38వ డివిజన్ లో కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని కార్పొరేటర్ తోట హేమామాదురి సుధీర్ ఆధ్వర్యంలో గురువారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. వైసిపి పార్టీకోసం కృషి చేస్తున్న 38వ డివిజన్ లో పలువురు నాయకులు, కార్యకర్తలతో ఆళ్ల నాని ముఖా ముఖి గా సమావేశం అయ్యారు. రాబోయే ఎన్నికల్లో అవలంబించాల్సిన విధివిధానాలపై ఆళ్ల నాని దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా నిజాయితీతో కూడిన సంక్షేమ పాలనను అందిస్తూ, లక్షలాది పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన తరుణం వచ్చేసిందని, ప్రతి ఒక్క కార్యకర్త మరొకసారి ప్రత్యేక చొరవ తీసుకుని పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆళ్ల నాని సూచించారు. పార్టీ కోసం నిస్వార్ధంగా సేవలందించే  కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ ఎల్లవేళలా తిరిగి అండగా ఉంటుందని ఆళ్ళ నాని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను అదుపు చేస్తూ, 2019లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిబిటి విధానం ద్వారా సంక్షేమ పాలనను ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా ప్రజలకు అందించి, అవినీతి లేని సమాజాన్ని సృష్టిస్తూ, మరోవైపు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు తీసుకువచ్చి , గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని, అటువంటి నాయకుడి పాలన కొనసాగించడంలో ప్రతి వైసీపీ కార్యకర్త భాగస్వామ్యం అవడం ద్వారా భావితరాలకు తమను తాము గర్వంగా చెప్పుకునే అవకాశం కార్యకర్తలకు దక్కుతుందని ఆళ్ల నాని సూచించారు. ప్రతి ఒక్క వైసిపి కార్యకర్త రోజుకి 2గంటలు పార్టీ కోసం  తమ వీధిలో,తమ డివిజన్లలో జగన్   సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై వాటర్ లకు వివరించాలన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మోసపూరిత ప్రకటనలతో, పథకాలతో మీ ముందుకు వస్తున్నారని వాళ్లు చెప్పే అబద్ధపు మాటలు ప్రచారాలను నమ్మవద్దని  వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ  నూకపేయ్యి సుదీర్ బాబు, గుడి దేసి శ్రీనివాస్, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నేరుసు చిరంజీవి, క్లస్టర్ త్రీ అధ్యక్షులు మంచo మై బాబు, కో- ఆప్షన్ సభ్యులు  ఎస్ ఎం ఆర్ పెదబాబు, జాన్ గురునాథ్, వైసిపి నాయకులు తోట అప్పారావు, తోట శివ, పలువురు నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author