NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దసరా మహోత్సవాల ఏర్పాట్లపై సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం:  రేపు నెలా జరగబోయే దసరా మహోత్సవ నిర్వహణకు సంబంధించి  ఏర్పాట్లను ఈ రోజు ఆలయ పరిపాల భవనంలో అధికారులతో సమావేశం నిర్వహించిన ఈఓ మరియు ఉభయ దేవాలయ ప్రధాన అర్చకులు ధర్మకర్తలమండలి సభ్యులు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఉత్సవాలలో శ్రీస్వామి అమ్మవార్లకు జరిపించాల్సిన ఆయా కైంకర్యాలు, శ్రీస్వామిఅమ్మవార్లకు వాహనసేవలు, శ్రీ అమ్మవారికి నవదుర్గ అలంకరణలు, భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, దర్శనం ఏర్పాట్లు. సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు మొదలైన అంశాలను కూలంకుషంగా చర్చించారు దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. భక్తులు  ఉత్సవ విశేషాలను వీక్షించేందుకు వీలుగా గంగాధర మండపం వద్ద ఎల్.ఈ.డి స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు. ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారు. స్వామి అమ్మవార్లకు వాహన సేవలపై గ్రామోత్సవం నిర్వహిస్తామని ఈవో పెద్దిరాజు తెలిపారు.

About Author