స్కూల్ కాంప్లెక్స్ ల స్థానంలో క్లస్టర్స్ విధానం అమలపై సమావేశం
1 min read
ఎస్ఎంసి, హెచ్ఎం, ఎంఇఓలతో సమాలోచనలు పునర్మాణంపై సమావేశం
జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పాఠశాల విధ్యాశాఖలో కీలకమైన స్కూల్ కాంప్లెక్స్ ల స్ధానంలో క్లస్టర్స్ పునర్నిర్మాణంపై స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఏలూరు డివిజన్ ఎస్ఎంసి, హెచ్ఎం, ఎంఇఓలతో ,విద్యాశాఖ నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పాల్గొన్నారు. జీఓ 117 రద్దు నేపథ్యంలో పాఠశాలలను శాటిలైట్ స్కూల్స్, ఫౌండేషనల్ స్కూల్స్, బేసిక్ ప్రైమరీ, మోడల్ ప్రైమరి,హై స్కూల్స్ గా మార్పులకు సంబంధించి తల్లిదండ్రులకు,స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులకు వివరించి పాఠశాల వారీగా తీసుకున్న అభ్యంతరాలను,అంగీకారాలను ఈ సందర్బంగా కలెక్టర్ ఆరాతీశారు. సమావేశంలో ఏలూరు డివిజన్ లోని 11 మండలాలకు చెందిన ఆయా పాఠశాలల్లో ఎంఇఓలు, ఎస్ఎంసి చైర్మన్ లు, హెచ్ఎం లు పాల్గొని స్కూల్ మోనిటరింగ్ కమిటీ లో తీసుకున్న తీర్మానాల వివరాలను వివరించారు. సదరు విషయంపై మరోసారి చర్చించుకొని తెలిపితే,తుదిగా స్కూల్ మేనేజింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ, ఆయా పాఠశాలల్లో ఎంఇఓలు, ఎస్ఎంసి చైర్మన్ లు, హెచ్ఎం లు పాల్గొన్నారు.