విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై సమావేశం..
1 min readజనవరి ఒకటో తేదీ నుండి ఫిబ్రవరి 29వ తేదీ లోగా లైఫ్ సర్టిఫికెట్స్ అందజేయాలి..
జిల్లా డిప్యూటీ డైరెక్టర్ టి కృష్ణ ,
ఎస్ టి ఓ స్వరాజ్యమని
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏ. పి. రాష్ట్ర ట్రజరి ఉన్నతాధికారులు ఆదేశాలు మేరకు ఏలూరు జిల్లా డిప్యూటి డైరెక్టర్ ఆఫ్ ట్రజరీ స్ కృష్ణ ఆధ్వర్యములో ఏలూరు సబ్ – ట్రజరి ఆఫీస్ కోట దిబ్బ లొ ఏలూరు జిల్లా విశ్రాంత ఉద్యోగుల సమస్యలను, జిల్లా నాయకులను అడిగితెలుసుకున్నారు, ఈ సమావేశంలో ఏలూరు ఏటిఓ, సత్యనారాయణ. ఎస్ టి ఓ, స్వరాజ్య మని, జిల్లా నాయకులు బి ఆంజనేయులు, డి గంగాధరరావు, ఇజ్రాయేల్ మాస్టర్,ఆర్ వెంకటేశ్వర్లు, ఏ అప్పల రాజు, సమావేశంలో పాల్గొన్నారు, డిడిటి కృష్ణ ,ఏ టి ఓ సత్యనారాయణ, ఎస్ టి ఓ స్వరాజ్యమని మాట్లాడుతూ ఇన్ కమ్ టాక్స్ చెల్లింపు విషయమై ” ఓల్డ్ రివిజన్, న్యూ రివిజన్” గురించి.7.5 లక్షలు లోపు అయితే టాక్స్ ఉండదని తెలిపారు. 1- 1- 2024 నుండి 29-2- 2024 లోగా లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలని తెలియజేశారు, ఇక పై ప్రతి నెల 17 వ తేదీన పెన్షన్ ఆఫీసు లో విశ్రాంత ఉద్యోగుల మీటింగ్ కు తమ ఆఫీసు సిబ్బంది కూడా వస్తారని చెప్పారు.