ఆదర్శ్ గ్రామ యోజన పథకం పురోగతి పనులపై సమావేశం
1 min read– జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ జిల్లా కలెక్టర్
– డా. సృజన ,జడ్పీ సీఈఓ నసార రెడ్డి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆధ్వర్యంలో సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన (SAGY) పథకం క్రింద జరుగుతున్న పురోగతి పనులపై సంబంధిత అధికారులతో నిర్వహించనున్న జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దత్తత గ్రామాల్లోఉన్న త్రాగునీరు,సీసీ రోడ్లు,డ్రైనేజ్ మొదలగు సమస్యలు మరియు అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో మాట్లాడారు సమస్యల పరిష్కారం చేయాలి అని తెలిపారు.ప్రజల ఆరోగ్య ప్రయోజనాల రీత్యా తక్కువ డబ్బు ఖర్చుతో మందులు జన ఔషద్ ద్వారా పొందవచ్చు అని ప్రతి గ్రామంలో జన ఔషద్ మందుల అంగడి ఏర్పాటు కు కృషి చేయాలి అని జిల్లాలో డిస్ట్రిబ్యూట్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని అదేవిధంగా గ్రామాల్లో మెరుగైన సేవలు అందించండి గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని కేంద్రప్రభుత్వం నుంచి అమలు అవుతున్న పథకాలు ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇవ్వాలి అని అదేవిధంగా నా పరిధిలో ఉన్న దత్తత గ్రామాలు అభివృద్ధి తో జిల్లాలోని అన్ని గ్రామాలు అభివృద్ధికి కృషిచేస్తానని ఎంపీ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.