కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లుతో సమావేశం
1 min read– 2024 ఎన్నికల్లో నాన్న గారిని అఖండ మెజార్టీ తో గెలిపించండి.
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: బనగానపల్లె మండలం ఎర్రగుడి గ్రామ సచివాలయం లో నీ ఎర్రగుడి గ్రామం లో మార్చి నెల 18 నుంచి 26 వ తేదీ వరకు ఇంటింటికి జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమం ను విజయవంతం చేయడానికి గ్రామ వైయస్సార్ పార్టీ నాయకులు,వాలంటీర్లు,గృహ సారథులు,కార్యకర్తల తో ముఖ్య సమావేశాన్ని బనగానపల్లె నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి గారి తనయుడు కాటసాని ఓబుల్ రెడ్డి గారు సమావేశాన్ని నిర్వహించారు.అనంతరం గ్రామం లో అభివృద్ధి పనులతో పాటు సమస్యలను కూడా వారితో స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా కాటసాని ఓబుల్ రెడ్డి గారు జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన వాలంటీర్లు,గృహ సారథిల బాధ్యత అని చెప్పారు. వచ్చే 2024 వ సంవత్సరం ఎన్నికల్లో వైయస్సార్ పార్టీ అభ్యర్థిగా నాన్న గారు కాటసాని రామిరెడ్డి గారు బరిలో వుండడం జరుగుతుంది అని నాన్న గారిని అత్యధిక మెజార్టీ తో గెలిపించడానికి అందరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు.మార్చి నెల 18 వ తేదీ నుంచి 26 వ తేదీ వరకు నిర్వహించి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని గ్రామం లోని వైయస్సార్ పార్టీ నాయకులు అందరూ కలిసి కట్టుగా వుండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో వైయస్సార్ పార్టీ నాయకులు తులసి రెడ్డి గారి రామ సుబ్బారెడ్డి,వెంకట సుబ్బారెడ్డి,కప్పేట ప్రతాప్ రెడ్డి,ఆంజనేయులు,నట్టల గోపాల్, మద్ధయ్య,నాగ తిమ్మయ్య,శివ నారాయణ,జి. వెంకటరామిరెడ్డి,కన్వీనర్లు,వాలంటీర్లు, గృహ సారథులు, వైయస్సార్పార్టీనాయకులు, కార్యకర్తలు.పాల్గొన్నారు.