PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రుణాల మంజూరుపై జిల్లా కలెక్టర్ బ్యాంకర్లతో సమావేశం

1 min read

– జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు
పల్లెవెలుగు వెబ్​ కర్నూలు : జగనన్న తోడు పథకం కింద నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు బ్యాంకర్లను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జగనన్న తోడు పథకం కింద రుణాల మంజూరు పై జిల్లా కలెక్టర్ బ్యాంకర్ల తో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న తోడు పథకం కింద ఆరవ విడత రుణాలు మంజూరుకు సంబంధించి ఆయా బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 10493 మందికి, పట్టణ ప్రాంతాల్లో 19542 మందికి జగనన్న తోడు పథకం కింద రుణాల మంజూరుకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు.. బ్యాంక్లకు దరఖాస్తులను త్వరితగతిన పంపించాలని, మంజూరు ప్రక్రియను పర్యవేక్షించేందుకు 9 బ్యాంక్ లకు 9 మంది నోడల్ అధికారులను నియమించేలా చర్యలు తీసుకోవాలని డిఆర్డిఎ ఎపిడి, మెప్మా పిడి లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తులలో సమాచారం సరిగా లేకుంటే వాటిని సంబంధిత నోడల్ అధికారులు రీవెరిఫై చేసి మరల బ్యాంక్ లకు పంపించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.. ఏపీజీబీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, డిసిసిబి, ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రాంచుల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను నిబంధనల మేరకు పరిశీలించి శ్యాంక్షన్ చేయాలని, అదే విధంగా వచ్చిన దరఖాస్తులు వచ్చినట్లుగా గైడ్లైన్స్ ప్రకారం రుణాల మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు.ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట నారాయణ, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, డిఆర్డిఎ ఎపిడి, మెప్మా పిడి, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author