గృహ ఇంజనీరింగ్ అసిస్టెంట్ లతో సమావేశం..
1 min read– నాడు నేడు, హెల్త్ క్లినిక్ సెంటర్లను త్వరగ తిన పూర్తిస్థాయిలో నిర్మించాలి..
– ఎంపీడివో జి రాజ్ మనోజ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా : పెదవేగి మండలం లో జగనన్న లే ఔట్ లలో బేస్ మెంట్ నిర్మాణాలకు కూడా నోచుకోని గృహ నిర్మాణాలను గుర్తించి బేస్ మెంట్ వరకు నిర్మాణాలు జరిగేలా సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు వెంటనే చర్యలు చేపట్టి లబ్ది దారులను చైతన్య వంతులను చేయాలని పెదవేగి ఎం పి డి ఓ గంజి రాజ్ మనోజ్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం సాయంత్రం ఎం పి డి ఓ మండల పరిషత్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ల తో సమావేశం నిర్వహించారు. మండలంలో జగనన్న గృహ నిర్మాణాలు బేస్ మెంట్ నుండి గృహాలు పూర్తి స్థాయిలో నిర్మించడానికి సిబ్బంది తమ వంతు కృషి చేయాలన్నారు. గృహాలతో పాటు ప్రాధాన్యత గల వివిధ నిర్మాణదశలలో ఉన్న సచివాలయాల నిర్మాణాలు. రైతు భరోసా. హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలుపూర్తి చేయాలని వారికి సూచించారు. నాడు నేడు లో నిధులున్న గ్రామాలలో అదనపు తరగతి గదులు పూర్తి స్థాయిలో నిర్మించే విధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కృషి చేయాలని ఎం పి డి ఓ రాజ్ మనోజ్ ఆదేశించారు. పెదవేగి మండలంలో కొన్ని సచివాలయ. రైతు భరోసా.హెల్త్ క్లినిక్ నిర్మాణాలు కోర్ట్ వివాదాల్లో ఉన్నాయని తెలిపారు. మండలంలో వంగూరు.తాళ్లగోకవరం. జానంపేట. కవ్వ గుంట తదితర గ్రామాలలో ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలైన ఆర్. బి కె .సచివాలయ. హెల్త్ క్లినిక్ లు వివిధ నిర్మాణాలతో నిలిచిపోయాయన్నారు. వీటిని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు సత్వర చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ఇప్పటికే మండల స్థాయిలో 32 ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాల నిర్మాణాలు పూర్తి చేసి జిల్లా స్థాయిలో పెదవేగి మండలం ప్రదమ స్తానంలో నిలిచిందని ఎం పి డి ఓ రాజ్ మనోజ్ తెలిపారు. జగనన్న కాలనీలలో సి సి రోడ్లు నిర్మాణాలకు సమయం పడుతుందని. జగనన్న కాలనీలలో నివాసాలుంటున్న లబ్ది దారుల సౌకర్యార్థం డ్రైనేజీలు నిర్మాణం చేపట్టే వరకు జగనన్న ఇళ్లల్లో వాడే నీరు రహదారుల పైకి రాకుండా ఇప్పటి వరకు 521వ్యక్తిగత ఇంకుడు గుంతలు నిర్మించ దానికి నిధులు మంజూరయ్యాయని ఎం పి డి ఓ తెలిపారు.ఈ సమావేశం లో ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఇ శ్రీకాంత్. హోసింగ్ ఏఇ కె నాగరాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు.