NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు రూరల్ మండలాల నాయకులతో సమావేశం..

1 min read

వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లండి..

బూత్ కమిటీలు పకడ్బందీగా పనిచేయాలి

ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు రూరల్ మండలంలోని గుడివాకలంక, ప్రత్తికోళ్లలంక మరియు కొక్కిరాయిలంక గ్రామాలకు చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి  మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో ఆయా మండలాలలో, మరియు గ్రామాలలో జరిగిన అభివృద్ధిని అలాగే మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రతి గడపకు వెళ్లి ఇంకా తెలియని వారికి వివరించి మంచి చేసిన మన జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించి, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందే విధంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేలా కొంత సమయం తీసుకుని ఒక గంట, రెండు గంటల పాటు కార్యకర్తలు ప్రజలకు తెలియజేయాలని కోరారు. మరియు రాబోయే రోజుల్లో బూత్ కమిటీలు పగడ్బందీగా పనిచేయాలని దిశా నిర్దేశం చేయడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీపీ పెన్మత్స శ్రీనివాసరాజు, కొల్లేరు నాయకులు మండల కొండలరావు,  కొక్కిరాయి లంక సర్పంచ్ తోకల అమల మరియు వైసిపి మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author