PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 వర్తక… వాణిజ్య యాజమాన్య సంఘాలతో సమావేశం..

1 min read

ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ చట్టం 2015, రిజిస్ట్రేషన్ చట్టం పొంది ఉండాలి..

సంయుక్త కార్మిక కమిషనర్ ఏ రాణి,

కార్మిక కమిషనర్ పి శ్రీనివాస్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : కార్మిక కమీషనర్, ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ వారి ఆదేశాల మేరకు సంయుక్త కార్మిక కమీషనర్ ఏ. రాణి, ఉప కార్మిక కమీషనరు పి. శ్రీనివాస్  తో కలిసి మంగళవారం సాయంత్రం కార్మిక శాఖ ఏలూరు కార్యాలయంలో వివిధ వర్తక, వాణిజ్య యాజమాన్య సంఘాలతో సమావేశం నిర్వహించినారు. ఈ సమావేశం నందు  జోన్-2 (కాకినాడ జిల్లా , తూర్పు గోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, యన్.టి.ఆర్ జిల్లా మరియు కృష్ణా జిల్లా) లోని దుకాణములు మరియు వాణిజ్య వ్యాపార సంస్థలు , మోటారు రవాణా యాజమాన్యాలు, భవన మరియు ఇతర నిర్మాణ రంగ సంస్థలు, కాంట్రాక్టు కార్మికులను వినియోగించే కాంట్రాక్టర్లు మరియు ప్రిన్సిపల్ ఎంప్లాయర్లు , అంతర్ రాష్ట్ర వలస కార్మికులను వినియోగించే కాంట్రాక్టర్లు మరియు ప్రిన్సిపల్ ఎంప్లాయర్లు విధిగా ఫిబ్రవరీ నెల, 29 వ తారీఖు లోపు ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ చట్టం, 2015 క్రింద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొంది ఉండాలని ఏ.రాణి , సంయుక్త కార్మిక కమీషనర్, జోన్-2, ఏలూరు వారు కోరారు. ఇది వరకే, ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ చట్టం, 2015 క్రింద రిజిస్ట్రేషన్ చేసుకున్న సంస్థలు వాటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను రెన్యూవల్ చేసుకోవాలని ఆమె కోరారు. ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ చట్టం, 2015 క్రింద వివిధ కార్మిక చట్టములు అనగా ఆంధ్రప్రదేశ్ దుకాణములు మరియు సంస్థలు చట్టం, 1988, భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికుల చట్టం , 1996, కాంట్రాక్టు కార్మికుల చట్టం, 1970, అంతర్ రాష్ట్ర  వలస కార్మికుల చట్టం, 1979, బీడీ మరియు సిగార్ కార్మికుల చట్టం, 1966, మోటార్ రవాణా కార్మికుల చట్టం, 1961 మరియు గ్రాట్యుటీ చెల్లింపు చట్టం, 1972 క్రింద రిజిస్ట్రేషన్ చేసుకోవలసిన సంస్థలన్నీ విడి విడిగా కాకుండా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ చట్టం, 2015 క్రింద కార్మిక చట్టాలన్నింటికీ ఒకే రిజిస్ట్రేషన్/లైసెన్స్ పొందే వెసులుబాటు ఉన్నదని వారు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ చట్టం, 2015 క్రింద సంస్థల రిజిస్ట్రేషన్/రెన్యూవల్ కొరకు యజమానులు/కాంట్రాక్టర్లు సమీపములోని మీ-సేవ కేంద్రములు/ సి.యస్.సి. సెంటర్లు మరియు గ్రామ/వార్డు సచివాలయములను సంప్రదించవలసినదిగా వారు తెలిపారు. అలాగే ప్రతి వర్తక యాజమాన్య సంఘాల వారు ప్రతి దుకాణం , సంస్థ యజమానులకు లైసెన్సు రిజిస్ట్రేషన్ / నవీకరణ  విషయములపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి నమోదు మరియు నవీకరణ ప్రక్రియ విజయవంత చేయవలసినదిగా కోరినారు. కార్యక్రమములో పి శ్రీనివాస్, ఉప కార్మిక కమీషనర్, ఏలూరు, జి నాగేశ్వరరావు, సహాయ కార్మిక కమీషనర్, ఏలూరు, టి.వి.వి.ఎ.ఎన్. మూర్తి, ఎ.సి.ఎల్ ఎస్‌ఎస్‌పి‌ఓ, ఏలూరు, జి వెంకట రమణ, సహాయ కార్మిక అధికారి, సర్కిల్ -1, ఏలూరు మరియు జె. గోపాల కృష్ణ, సహాయ కార్మిక అధికారి, సర్కిల్ – 2, ఏలూరు అధికారులు మరియు  నేరెళ్ళ రాజేంద్ర, ప్రెసిడెంట్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఏలూరు వారు, కిరాణామర్చంట్ అసోసియేషన్ బాలకృష్ణ, బ్రహ్మయ్య, మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి, మెటల్ అసోసియేషన్ యం. సిహెచ్ చంద్ర శేఖర్, టైలర్స అసోసియేషన్ పి. వెంకట్ మరియు  జిల్లాలోని ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

About Author