కోడూమూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
1 min readపల్లెవెలుగు వెబ్ కోడుమూరు: కోడూమూరు నియోజకవర్గ ఇంచార్జ్ మీసాల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా పిలుపుమేరకు రాష్ట్ర అద్యక్షురాలు శ్రీమతి పురందరేశ్వరి జిల్లా అద్యక్షులు కునిగిరి నీలకంఠ సూచనలతో విస్వకర్మ జయంతి , గాందీ జయంతి మరియు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 వ తారీకు నుండి సేవా పక్వాడ పక్షోత్సవాలు అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు చేయాలని పిలుపునిచ్చారు , వారి పిలుపు మేరకు వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా నిన్నటి రోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు దేశంలోని ప్రతి కార్యకర్త సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకొని గుడులు, బడులు ,వీధులు అనేక పబ్లిక్ ప్రాంతాల్లో స్వచ్ఛత కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం భారతదేశం మొత్తం పరిశుభ్రంగాను పచ్చగాను ఉండి ఆక్సిజన్ పెరగాలని ప్రజల ఆయుష్షు కూడా పెరగాలని వారు కాంక్షించడo, అదే కాక వివిధ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోడుమూరు నియోజకవర్గ కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైనది ఇందులో కోడుమూరు నియోజకవర్గం నుండి విశేషంగా కార్యకర్తలు పాల్గొని రక్తదానాన్ని ఇవ్వడం అయినదిభారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో తలెత్తుకునే విధంగా భారత ప్రతిష్టను ఇనుముడింపజేసిన దేశ ప్రధాని భారత్ లో అనేక సంక్షేమ , అభివృద్ధి యువతకు ఉపాధి మరియు విశ్వకర్మ పుట్టినరోజు సందర్భంగా 18 కుల వృత్తుల వారికి లక్ష నుండి మూడు లక్షల వరకు కేవలం మూడు శాతo వడ్డీతో ఇచ్చి వారికి పెట్టుబడి ఆర్థిక చేయూతనివ్వాలని ఆ యొక్క కార్యక్రమాన్ని గతనెల 17న ప్రారంభించడం అయినది. రాబోయే కాలంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలని ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి పేదలకు అండగావుంటూ దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ యొక్క మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైనది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సల్వాది సురేంద్ర అధ్యక్షతన కోడుమూరు నియోజకవర్గ కన్వీనర్ సద్దల మధు కిషోర్ మండల ప్రధాన కార్యదర్శి గోరంట్ల రాము యువనాయకులు విజయ్ కర్నూల్ యువ మోర్చా మండల అధ్యక్షులు యమలేష్ ,శివ, సీనియర్ నాయకులు ,కల్లపారి వెంకటేశ్వర్లు ,నట్రాజ్, పులకుర్తి నాగేంద్ర ,కొత్తపల్లి కృష్ణ బాలరాజ్ ,ముడమలగుర్తి నాగరాజ్ లోకేశ్ , కొత్తూరు దస్తగిరి , చనుగొండ్ల శివశంకర్ ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని అయినది.