PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘అమీలియో’లో మెగా రక్తదానం

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కరోన విపత్కర సమయంలో క్షతగాత్రులకు… బ్లడ్​ క్యాన్సర్​.. రక్తహీనతతో బాధపడే వారికి రక్తం అత్యవసరమని , అటువంటి వారిని కాపాడేందుకు ప్రతిఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు అమీలియో హాస్పిటల్​ మేనేజింగ్​ డైరెక్టర్​ డా. సి. లక్ష్మిప్రసాద్​ చాపె. ఆస్పత్రి స్థాపించి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూ లైఫ్​ ఇండియా వారి ఆధ్వర్యంలో మెగా రక్తదానం శిబిరం నిర్వహించారు. శిబిరంలో దాతలు, యువకులు 60 మంది రక్తదానం చేశారు.

కరోన కష్టకాలంలో ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలకు సేవ చేశామన్న ఆస్పత్రి ఎండీ డా.సి.లక్ష్మి ప్రసాద్​ చాపె … ఎందరో ప్రాణాలను కాపాడి.. వారి ఆశీస్సులు పొందామన్నారు. ప్రజల మన్ననలు, ఆదరాభిమానం ఉన్నంత వరకు వైద్య సేవలు అందిస్తూనే ఉంటామన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఎల్లప్పుడూ ముందుంటామన్న డా.లక్ష్మి ప్రసాద్​… ఇప్పటికే విద్యార్థులకు పుస్తకాలు, స్టైఫండ్​, పేదలకు అన్నదానం తదితర సేవలు అందిస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, దాతలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

About Author