PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెగా డీఎస్సీ తక్షణమే విడుదల చేయాలి

1 min read

– ఉపాధ్యాయ, పి.ఈ.టి పోస్టులు భర్తీ చేయాలి
– PDSU జిల్లా అధ్యక్షులు S.M.D.రఫీ
పల్లెవెలుగు వెబ్ నంద్యాల : నంద్యాల పట్టణంలో సిపిఐ(M.L.) న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో PDSU జిల్లా అధ్యక్షులు S.M.D.రఫీ మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి డీఎస్సీ నోటిఫికేషన్ రాకపోవడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది బిఈడి టిటిసి చదివిన నిరుద్యోగ యువకులు తీవ్రంగా నష్టపోతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలయినా ఒక్క డీఎస్సీ ప్రకటన రాకపోవడంతో వయోపరిమితి మించిపోయి నిరుద్యోగులుగా మారిపోయా అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పీఈటి పోస్ట్లు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని.కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా 50వేల పైగా ఉపాధ్యాయ పోస్టులు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నాయి చెప్పినప్పటికీష్ట్రంలో దాదాపు 50 వేల6 పోస్టులకు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉంటే విద్యాశాఖ మంత్రి కనీసం అవగాహన లేకుండా నోటికి వచ్చిన లెక్కలు చెబుతున్నారనివిమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం ఖాళీలపై స్పష్టత ఇవ్వకుండా గా నిరుద్యోగం మోసం చేయడం ద్వారా తీవ్రంగా నష్టపోతారునీ. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు పేరుతో కోట్లాది రూపాయలు నీధులు కేటాయిస్తున్న నేపథ్యంలో మెరుగైన విద్యను అందించాలంటే ఉపాధ్యాయ, పి ఈ టి పోస్టులు భర్తీ చేయడం ద్వారానే విద్యార్థులకు నాణ్యమైన మెరుగైన విద్య అందించే అవకాశం ఉందినీ ప్రభుత్వము అనుకున్న 100% అక్షరాస్యత సాధించాలని లక్ష్యం నెరవేరాలంటే ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పిఈటి పోస్టులు భర్తీ చేయడమే ఏకైక మార్గం. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కార కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కృషి చేయాలని కోరుతూ మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పిటి పోస్ట్ లు పెంచాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

About Author