PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెగా అభిమానులు.. సేవ స్ఫూర్తితో నడుచుకోవాలి

1 min read

– చిరంజీవి యువత కర్నూలు జిల్లా అధ్యక్షుడు చింత సురేష్ బాబు
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: మెగాస్టార్​ చిరంజీవి అభిమానులు.. సేవా స్ఫూర్తితో కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు చిరంజీవి యువత కర్నూలు జిల్లా అధ్యక్షుడు చింత సురేష్ బాబు. ఆదివారం కర్నూలు అతిథి హోటల్​లో మెగా అభిమానుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చింతా సురేష్ బాబు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో మెగా అభిమానులు ఏకతాటిపై ముందుకు సాగాలన్నారు. వాట్సాప్ కే పరిమితం కాకుండా సోషల్ మీడియాలో ఫేస్బుక్ ,ట్విట్టర్ , ఇంస్టాగ్రామ్ గాని ప్రతి ఒక్క దానిలో ముందంజలో ఉండి రాష్ట్రంలో మెగా అభిమానులు చేసే కార్యక్రమాలను ప్రపంచానికి తెలపాలన్నారు. సోషల్​మీడియాలో అభిమానులు బాధ్యతగా పని చేయాలని సూచించారు.

About Author