PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎక్స్ పర్ట్ డెంటల్ కేర్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం..

1 min read

ఆరోగ్యానికి ముఖ్య భూమిక దంతాలని ప్రతి ఒక్కరు గుర్తు ఎరగాలి..

గత సంవత్సరాల పైబడి వారి సేవలో అభినందనీయం..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఎక్స్పర్ట్ డెంటల్ కేర్ ఆధ్వర్యంలో శనివారం పెదవేగి మండలం రామశింగవరం గ్రామం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో డాక్టర్ శ్రీహర్ష ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు.  ఈ సందర్భంగా స్కూల్ పిల్లలందరికీ ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించి  అవసరం అయిన వారికి ఉచితంగా మందులు, టూత్ పేస్ట్ లను  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  పేరెంట్స్ కమిటీ చైర్మన్ టి సురేష్ , పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  టివి పద్మవతి మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. మండలంలో ఉన్న మిగతా పాఠశాలల నిర్వాహకులు కోరితే వారీ విద్యార్థులకు కూడా వైద్య శిబిరం నిర్వహిస్తామని ఎక్స్పర్ట్ డెంటల్ కేర్ అధినేత శ్రీ హర్ష   తెలియచేశారు. ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడుతూ మానవ అవయవాలలో దంతాలు ప్రాముఖ్యమైనవని, మనం తీసుకునే ఆహారం ద్వారానే ఆరోగ్యం మరింత మెరుగు చెందుతుందని, దానికి ముఖ్య భూమిక దంతాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని, ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు  గుర్తు ఎరగలన్నరు. నిర్వాహకులు మాట్లాడుతూ ‌తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన డాక్టర్ శ్రీ హర్ష కీ ఉపాధ్యాయురాలు జి.నీలిమ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గత సంవత్సరాల నుండి ఎక్స్పెక్ట్ డెంటల్  హాస్పటల్ యాజమాన్యం వారు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నిరుపేదల కు మరియు అన్ని వర్గాల వారికి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి. గౌతం పది సంవత్సరాల పైబడి  కావలసిన మందులు, వైద్య సలహాలు పరీక్షలు నిర్వహించటం అభినందనీయమని పలువురు కొరియాడారు. పరీక్షలు చేయించుకున్న వారు మందులు తీసుకున్నవారు. మందులు తీసుకున్న వారు పరీక్షలు చేయించుకున్న వారు  డెంటల్ యాజమాన్యానికి  కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో పేద,పొడుగు బలహీన వర్గాలకి మరిన్ని ఉచిత  సేవలు అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. విచ్చేసిన డాక్టర్స్ కు, స్టాప్ కు, డెంటల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author