PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెగా ఉచిత మెడికల్ క్యాంపు విజయవంతం

1 min read

– మధు పవన్( సామాజిక కార్యకర్త)
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: పట్టణంలోని అర్బన్ కాలనీ లోని 22వ వార్డు పరిధిలో శ్రీ శక్తి భవన్లో నిర్వహించిన మెగా ఉచిత మెడికల్ క్యాంపును కున్నూరు మధు పవన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.మెగా ఉచిత మెడికల్ క్యాంపు కి వెయ్యి మందికి పైగా చుట్టుపక్కల ప్రజలు మెడికల్ క్యాంపు కి విచ్చేసి డాక్టర్స్ సేవలను వినియోగించు కున్నారు. పేషెంట్ లకు డాక్టర్లు పరిక్షలు చేసి ఉచితంగా నెలకు సరిపడా మందులు అందజేశారు.ఈ సందర్భంగా మధు పవన్ మాట్లాడుతూ ఈ అవకాశన్నీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పేదలు, మధ్య తరగతి ప్రజలు హాస్పిటల్లో ఫీజులు కట్టలేక ఆస్తులు అమ్ముకుంటున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు.వైద్యం, విద్యా రంగానికి ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేయడం లేదు అని విమర్శించారు.ప్రజలందరికీ ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు .ఈ కార్యక్రమంలో మెడికల్ క్యాంప్ లో ప్రముఖ డాక్టర్లు లతోపాటు కొండ వెంకట్, రవి కిరణ్, జాకీర్, జావీద్, పాల్గొన్నారు.

About Author