NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ నైపుణ్య అభివృద్ధి , శిక్షణ సంస్థ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా..

1 min read

– జీవితంలో యువత స్థిరపడటానికి జాబ్ మేళాలు ఎంతో దోహదపడతాయి..

– ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి

– విశిష్ట అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  ఈరోజు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ది మరియు శిక్షణా సంస్థ వారి అధ్వర్యంలో, దెందులూరు శాసనసభ్యులు  కొటారు అబ్బయ్య చౌదరి  సహకారంతో వట్లూరు సర్ సి ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ నందు మెగా జాబ్ మేళా జరిగినది. సదరు జాబ్ మేళాలో 34 కంపెనీ లు పాల్గోనడమయినది. సదరు కంపెనీలకు 1580 అభ్యర్దులు దరఖాస్తు చేసుకొని ఇంటర్వూ లకు హాజరు కాగ వారిలో 135 మంది అభ్యర్దులు ఉద్యోగాలకు ఎంపిక కాబడ్డారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్  ఘంటా పద్మశ్రీ ప్రసాద్ విశిష్ట అతిదిగా హాజరయి మాట్లాడుతూ ఇటువంటి జాబ్ మేళాలు స్థానిక యువత జీవితంలో స్థిరపడటానికి ఎంతగానో దోహదపడతాయని, ఈ నైపుణ్యాభివృద్ది మరియు శిక్షణా సంస్థ ద్వారా గ్రామీణ యువతకు నైపుణ్యత పెంపొందించడానికి మన ప్రభుత్వం ప్రతి నియోజక వర్గం లోను ఒక స్కిల్ హబ్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు, ఉద్యోగాలు పొందిన అభ్యర్దులకు అభినందనలు తెలిపి వారికి ఆఫర్ లెటర్లు అందించడం జరిగినది. ఈ కార్యక్రమానికి జిల్లా బి.సి సెల్ అధ్యక్షులు ఘంటా ప్రసాదరావు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ జిల్లా కోర్దినెటర్ తమ్మాజి, సి.ఆర్.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, కళాశాల కరెస్పాండంట్, పెదవేగి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆర్. రాజ్ మనోజ్, వై.సి.పి నాయకులు బొడ్డు సతీష్, ఎం.వెంకట సత్య వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author