NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ ఇన్వెస్టర్ల కు.. ‘ మెగా రిసా’ తో అవగాహన..

1 min read

సెమినార్ నిర్వహించిన AMFI, SEBI

విజయవాడ : సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాతో (సెబీ) కలిసి అసోసియేషన్ ఆఫ్ మ్యుచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) విజయవాడలో ‘మెగా రిసా (RISA)’ను (రీజనల్ ఇన్వెస్టర్ సెమినార్ ఫర్ అవేర్‌నెస్) విజయవంతంగా నిర్వహించింది. ‘మ్యుచువల్ ఫండ్ సహీ హై’ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇది నిర్వహించబడింది. ఇన్వెస్టర్లలో కీలకమైన ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం, పూర్తి వివరాల దన్నుతో నిర్ణయాలు తీసుకునే విధానాన్ని, బాధ్యతాయుతమైన ఇన్వెస్టింగ్‌ను ప్రోత్సహించడం లక్ష్యంగా ఇది నిర్వహించబడింది. ఆంధ్రప్రదేశ్ ఎంఎల్ఏ గద్దె రామ్మోహన్, సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ కుమార్, AMFI చీఫ్ ఎగ్జిక్యూటివ్ Mr. వెంకట్ చలసాని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు ఆర్థిక రంగ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.  

ప్రాంతీయ ఇన్వెస్టర్లకు ‘ సాధికారత ’ ..

అందుబాటులో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ మార్గాలు, ఆర్థిక మార్కెట్లకు సంబంధించిన వివిధ కోణాలు, మోసాల నివారణ, స్మార్ట్ ఇన్వెస్టింగ్ విధానాలపై అవగాహన కల్పించేందుకు ‘ఇన్ఫార్మ్‌డ్ ఇన్వెస్టర్ సహీ హై’ థీమ్‌తో ఈ సెమినార్ నిర్వహించారు. భారతదేశంలో 8వ అతి పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో మూడు పారిశ్రామిక కారిడార్లు, 47 స్పెషల్ ఎకనమిక్ జోన్లు, 71 శాతం వర్కింగ్ ఏజ్ ప్రజలు ఉన్నారు. ఈ వృద్ధిని గుర్తించే, ఆర్థిక అక్షరాస్యత, రిస్క్ మేనేజ్‌మెంట్ మరియు బాధ్యతాయుతమైన ఇన్వెస్టింగ్‌పై అవగాహన పెంపొందించడం ద్వారా ప్రాంతీయంగా ఇన్వెస్టర్లకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో ఈ సెమినార్ నిర్వహించబడింది.

నిపుణుల సారథ్యంలో ప్యానెల్ డిస్కషన్లు, ఇంటరాక్టివ్ సెషన్లతో పాటు ఆర్థిక అక్షరాస్యత మరింత అందుబాటులోను, ప్రభావవంతంగాను ఉండేలా రూపొందించిన కార్యక్రమాలు ఈ సందర్భంగా నిర్వహించబడ్డాయి. పరిశ్రమ దిగ్గజాలు, ఆర్థిక రంగ నిపుణులు, నియంత్రణ సంస్థల ప్రతినిధులు మొదలైన వారు పెట్టుబడి వ్యూహాలు, మార్కెట్ ధోరణులు, సంపద సృష్టిలో పూర్తి సమాచారంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించి అమూల్యమైన విషయాలను వివరించారు.

“ఆర్థిక మార్కెట్ సజావుగా, ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొని పని చేయగలిగేలా ఉండేందుకు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అనేది కీలకమైన మూలస్తంభంగా ఉంటుంది. వివిధ మార్కెట్ సైకిల్స్‌వ్యాప్తంగా పెట్టుబడులను కొనసాగిస్తూ, రిస్కులను అధిగమిస్తూ, దీర్ఘకాలంలో సంపదను నిర్మించుకోవడంలో ఇన్వెస్టర్లకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించేందుకు AMFI కట్టుబడి ఉంది. ఆర్థిక అక్షరాస్యత, బాధ్యతాయుతమైన పెట్టుబడుల సంస్కృతిని పెంపొందించే దిశగా మెగా RISA సెమినార్ ఒక కీలకమైన ముందడుగు కాగలదు. నియంత్రణ సంస్థ మద్దతుతో మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ, ఇన్వెస్టర్లలో ఒక నమ్మకాన్ని కలిగిస్తోంది. మ్యుచువల్ ఫండ్ ద్వారా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం కూడా భారత ఎకానమీకి చోదకశక్తిగా నిలుస్తోంది” అని AMFI చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ ఎన్ చలసాని తెలిపారు.

“దీర్ఘకాలిక సంపద సృష్టి మరియు ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణపై మదుపర్లలో అవగాహనను పెంపొందించేందుకు సెబీ కట్టుబడి ఉంది. ప్రపంచంలోనే అత్యంత పారదర్శకమైనదిగా భారతీయ మ్యుచువల్ ఫండ్ పరిశ్రమకు పేరుంది. మిగతా వారి భాగస్వామ్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడమనేది ఇన్వెస్టర్లతో నియంత్రణ సంస్థ సంబంధాలను పటిష్టం చేస్తుంది. భారత్‌లోని వర్ధమాన పట్టణాల్లోని ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంపొందిస్తుంది. మెగా RISA ద్వారా ఆర్థిక ప్రపంచంలో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే పరిజ్ఞానాన్ని ఇన్వెస్టర్లకు అందించాలనేది మా లక్ష్యం. పూర్తి సమాచారం ఉన్న ఇన్వెస్టరే సాధికారిక ఇన్వెస్టరవుతారు. ఆర్థిక భద్రత, దీర్ఘకాలిక స్థిరత్వానికి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు దోహదపడతాయి” అని సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ మనోజ్ కుమార్ తెలిపారు.

కీలకమైన సెషన్లు:

“బీ ఫ్యూచర్ రెడీ: డోన్ట్ జస్ట్ సేవ్! ఇన్వెస్ట్” – సాంప్రదాయ పొదుపు నుంచి నిర్మాణాత్మక పెట్టుబడుల వైపు మళ్లాల్సిన ఆవశ్యకత గురించి ప్రముఖ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల నిపుణులు వివరించారు. వివిధ పెట్టుబడి మార్గాలు, సంపద నిర్మాణ వ్యూహాల గురించి తెలిపారు.

‘ఇంపాక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఆన్ ఫైనాన్షియల్ వెల్-బీయింగ్’ – ప్రాథమిక ఆర్థిక సమ్మిళితత్వం నుంచి ఆర్థిక సాధికారత, అంతిమంగా ఆర్థిక సంక్షేమానికి పరివర్తనపై మహిళా నిపుణుల ప్రత్యేక ప్యానెల్ చర్చించింది.

‘సెక్యూరిటీస్ మార్కెట్ & యూ‘ – ఇది సెక్యూరిటీస్ మార్కెట్ స్వరూపం, పనితీరు గురించి వివరణాత్మకమైన సెషన్. రెగ్యులేటరీ నిబంధనలు, మార్కెట్లో రిస్కులు, సరైన సమాచారంతో నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశాల గురించి ఇన్వెస్టర్లకు పరిజ్ఞానాన్ని అందించడం లక్ష్యంగా ఇది నిర్వహించబడింది.

‘ఫ్రాడ్స్ & స్కామ్స్: ఎ ప్రివెన్షన్ గైడ్’ – పోంజీ స్కీములు, అనధికారిక అడ్వైజరీ సర్వీసులు సహా సర్వసాధారణమైన పెట్టుబడి మోసాల గురించి నిపుణులు వివరించారు. అలాగే, ఆర్థిక స్కామ్‌లు, సైబర్ ముప్పుల నుంచి రక్షణ పొందేందుకు పాటించతగిన ఉత్తమ విధానాలను తెలియజేశారు.

భావి ఇన్వెస్టర్లు, వేతన ఉద్యోగులు, విద్యార్థులు మొదలైన వర్గాల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సెక్యూరిటీ మార్కెట్లపై విజయవాడలో పెరుగుతున్న ఆసక్తిని ఇది ప్రతిబింబించింది. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేందుకు అవసరమైన అవగాహనను పెంపొందించింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *